2024 ఎన్నికల్లో  మనందరి " ప్రభుత్వం అయిన  వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అది 5ఏళ్ళు పరిపాలన గెలుపు కాదని "అది భావితరాలకు మనం ఇస్తున్న  25ఏళ్ల పరిపాలన గెలుపుతో  సమానం " అని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు.

1.

2024 ఎన్నికల్లో  మనందరి " ప్రభుత్వం అయిన  వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అది 5ఏళ్ళు పరిపాలన గెలుపు కాదని "అది భావితరాలకు మనం ఇస్తున్న  25ఏళ్ల పరిపాలన గెలుపుతో  సమానం "


అని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు.

మంగళవారం 17 డివిజన్ లో  కార్పోరేటర్ ఫర్జాన  ఆధ్వర్యంలో " వైసీపీ ముఖ్య నేతలతో  ipd కాలనీ లోని ఇమిడి కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో  నూరిఫాతిమా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ నియోజకవర్గం  స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు 99 శాతం పూర్తి చేశామని వెల్లడించారు.

తూర్పు నియోజకవర్గన్ని    
రానున్న ఎన్నికల్లో  భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు

వైస్సార్సీపీ పార్టీ అంటే ఒక కులానికో ,ఒక మాతానికో సంబంధించిన పార్టీ కాదని ఆమె తెలిపారు.

 ఇది నిరుపేదల కోసం బడుగుబాలహీన వర్గాల ప్రజల కోసం పుట్టిన పార్టీయే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని  అన్నారు.

విభేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని.
మన పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. 
ఈ కార్యక్రమంలో
వైఎస్సార్ సీపీ ముఖ్య  నేతలు కర్ణుమ, వాక శ్రీనివాసరెడ్డి,గుదే నాగేశ్వరరావు, ఎర్ర బాబు,  బికారీ,  యదాల చిన్న, రమణి, యదాల రాము, తోట ఆంజనేయులు, వెంకటేశ్వర రెడ్డి, నగురా ,కొండరెడ్డిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు